Kiran Abbavaram | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇటీవలే తన కోస్టార్, నటి రహస్య గోరక్ (Rahasya Gorak)తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడని తెలిసిందే. కిరణ్ అబ్బవరం ఓ వైపు ప్రొఫెషనల్ లైఫ్‌ను లీడ్ చేస్తూనే.. మరోవైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ క ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
జనాలకు చాలా వరకు నా వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. నేను తరచూ ఎవరినీ అంతగా కలవను. నా పని, ఆఫీసుకు మాత్రమే పరిమితమవుతా. నాకు సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులకు మాత్రమే రహస్య గోరక్‌తో నా రిలేషన్షిప్ గురించి తెలుసు. ఈ విషయాన్ని పబ్లిక్కు చెప్పద్దనుకున్నాం. కానీ పెళ్లి విషయానికొస్తే మాత్రం అది సీక్రెట్‌గా పెట్టలేని విషయం.
రాజా వారు రాణి వారు షూట్లో తొలి రోజే రహస్య గోరక్‌తో ప్రేమలో పడ్డా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్‌ను నేనంతగా నమ్మను. కానీ ఇది అలా జరిగిపోయింది. నా మొదటి సినిమా మొదలై ఐదేళ్లవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్