Unstoppable With NBK | టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK). మరోసారి రెట్టించిన వినోదాన్ని అందించేందుకు కొత్త సీజన్ రెడీ అవుతుందని తెలిసిందే. నయా సీజన్లో స్టార్ సెలబ్రిటీలు సందడి చేయనుండగా.. మొదటి అతిథిగా మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ రాబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
లక్కీ భాస్కర్ దీపావళికి విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ భాగంగా దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సూర్య దేవర నాగవంశి టీం సందడి చేయనుందని ఇన్సైడ్ టాక్. కాగా మరో స్టార్ యాక్టర్ సూర్య కూడా బాలకృష్ణతో కలిసి మెరువబోతున్నాడన్న వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది.
సూర్య ప్రాంఛైజీ ప్రాజెక్టులో వస్తున్న కంగువ పార్టు 1 నవంబర్ 14న విడుదల కానుందని తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో కనిపించబోతున్నాడట సూర్య. త్వరలోనే బాలయ్య టీంతో సూర్య షూట్లో పాల్గొనబోతున్నాడట. సరైన టైంలో ఈ క్రేజీ ఎపిసోడ్‌ను ప్రసారం చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
అంతేకాదు ఈ సీజన్లో వన్ ఆఫ్ ది గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా సందడి చేయబోతున్నట్టు టాక్. మొత్తానికి ఈ సీజన్‌ను బాలయ్య గట్టిగానే ప్లాన్ చేశాడని తాజా వార్తలు చెప్పకనే చెబుతున్నాయి.
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్