Matka | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ మట్కా (Matka). పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రానికి పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం కరుణ కుమార్ టీం వింటేజ్ వైజాగ్‌ను రీక్రియేట్ చేసిందని తెలిసిందే. మట్కాలో కథానుగుణంగా వైజాగ్ బ్యాక్ డ్రాప్లో ఉండే పూర్ణా మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాలను రీక్రియేట్ చేశారు.
పూర్ణా మార్కెట్.. మట్కా.. బిహైండ్ ది గేమ్.. యాక్ట్ 1 అంటూ మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మట్కా.. బి హైండ్ ది గేమ్.. యాక్ట్ 2 అంటూ కూల్ స్పాట్ క్లబ్ వీడియోను షేర్ చేశారు. ఈ క్లబ్లో వరుణ్ తేజ్, నోరా ఫతేహి అండ్ టీంపై వచ్చే లే లే రాజా పాటను చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ సాంగ్ కలర్ఫుల్గా సాగుతూ సినిమాకు హైలెట్‌గా నిలువబోతుందని విజువల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారని తెలిసిందే. వరుణ్ తేజ్ సూట్లో సూపర్ స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ.. మెట్లు దిగుతున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మట్కాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
మట్కా.. బి హైండ్ ది గేమ్.. యాక్ట్ 2..
MATKA: BEHIND THE GAME – ACT 2 ~ ’𝑪𝒐𝒐𝒍 𝑺𝒑𝒐𝒕 𝑪𝒍𝒖𝒃’ out now❤️🔥
Watch #LeLeRaja song here!
— https://t.co/Y0nQWocI7t#MATKAonNOV14th pic.twitter.com/1kqbi6aR18— BA Raju’s Team (@baraju_SuperHit) October 16, 2024
MATKA: BEHIND THE GAME – ACT 1 ~ ’𝐏𝐨𝐨𝐫𝐧𝐚 𝐌𝐚𝐫𝐤𝐞𝐭 ‘🔥
▶️ https://t.co/T0mvKzzxnS#MATKAonNOV14th pic.twitter.com/R4zgWrjyLl
— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2024
Allu Arjun | పుష్పరాజ్ క్రేజ్.. అల్లు అర్జున్ను కలిసేందుకు సైకిల్‌పై 1600 కిలోమీటర్ల ప్రయాణం
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?