Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న ప్రాజెక్ట్ తండేల్ (Thandel). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించగా.. తండేల్ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ మరో వార్త తెరపైకి వచ్చింది.
తాజాగా తండేల్ సంక్రాంతి బరిలో నిలువబోతుందన్న అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరోవైపు రాంచరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న గేమ్ ఛేంజర్ 2025 జనవరి 10న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్తో పోటీ పడటం ఖాయమైపోయినట్టే. మరి తండేల్ రిలీజ్పై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
తండేల్లో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో నటిస్తోంది. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని గీతాఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడం విశేషం. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్లో కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
Exclusive : Sankranthi 2025 at Box-Office #GameChanger v/s #Thandel pic.twitter.com/YL4qtn7nIb
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) October 15, 2024
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!