Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.
కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఆడియో లాంచ్ అప్డేట్ వచ్చేసింది. తెలుగు, తమిళ ఆడియో లాంచ్ ఈవెంట్స్‌కు అతిథులను ఫైనల్ చేశారు మేకర్స్.
తెలుగు ఈవెంట్‌కు గ్లోబర్ స్టార్ ప్రభాస్, తమిళ వెర్షన్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ చిత్రం ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో విడుదలవుతుండటంతో అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది.
ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో Prathyangira, యూకేలో యశ్ రాజ్ ఫిలిమ్స్ , సింగపూర్‌లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో Phars విడుదల చేస్తుంది. ఈ మూవీని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Latest: Rebel Star #Prabhas has been invited to attend the Telugu pre-release event of #Kanguva. pic.twitter.com/Q8lMjVRLZI
— Movies4u Official (@Movies4u_Officl) October 14, 2024
Superstar Rajinikanth invited for #Kanguva audio launch. pic.twitter.com/jQwLKO7Ojv
— Manobala Vijayabalan (@ManobalaV) October 14, 2024
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్