Ananya Nagalla | నచ్చితే చేయండి.. లేకపోతే లేదు.. నెటిజన్లపై అనన్య నాగళ్ల ఫైర్
Ananya Nagalla | చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్‌మీడియాలో మాత్రం విపరీతమైన యాక్టివ్‌లో ఉంటుంది అనన్య నాగళ్ల. తన పర్సనల్ ఫొటోలతో పాటు మూవీ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మెసేజ్ కూడా ఇస్తూ ఉంటుంది
Ananya Nagalla | చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్‌మీడియాలో మాత్రం విపరీతమైన యాక్టివ్‌లో ఉంటుంది అనన్య నాగళ్ల. తన పర్సనల్ ఫొటోలతో పాటు మూవీ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మెసేజ్ కూడా ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ వాడద్దంటూ అనన్య చేసిన ఓ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కొంచెం అసహనానికి గురైన అనన్య నెటిజన్లపై సీరియస్ అయ్యింది. తనపై చేస్తున్న విమర్శలపై క్యూట్‌గా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
రెండు రోజుల క్రితం అనన్య నాగళ్ల స్ట్రా లేకుండా కొబ్బరి బొండాం తాగుతూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సాధారణంగా తాను స్టీల్ స్ట్రాను తన వెంట తెచ్చుకుంటానని.. అది లేనప్పుడు ఇలా డైరెక్ట్‌గా కొబ్బరి నీళ్లు తాగుతానని చెప్పింది. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గిద్దామని చెప్పింది. దీనిపై చాలామంది పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వగా.. కొంతమంది మాత్రం అనన్య నాగళ్లపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆ కామెంట్లు చూసి నొచ్చుకున్న అనన్య నాగళ్ల మరో వీడియోలో తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండని ఓ వీడియో చేశాను.. అందులో తప్పేముందని అనన్య నాగళ్ల ప్రశ్నించింది. నీ పక్కన స్ట్రాతో తాగుతున్నారు.. వాళ్లకు చెప్పండి.. మీరు కారు వాడట్లేదా.. ఇవన్నీ ఎందుకు అని సీరియస్ అయ్యింది. చిన్న విషయం చెప్పా.. నచ్చితే చేయండి.. లేకపోతే లేదు.. సింపుల్ కదా అని చెప్పింది. ఎందుకింత నెగిటివిటీ అంటూ క్యూట్‌గా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

