Lokesh Kanakaraj | విజయ్‌తో లోకేష్ కనకరాజ్ చేసిన ‘లియో’ వసూళ్లు పరంగా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా విషయంలో దర్శకుడిగా లోకేష్ చేసిన తప్పులను హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు జోసఫ్ విజయ్ చంద్రశేఖరన్ ఎత్తి చూపారు. ‘విడుదలకు వారం ముందే ‘లియో’ చూశాను. నాకు కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో కొన్ని తప్పులు కనిపించాయి. వెంటనే దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ని పిలిచి వాటిపై డిస్కస్ చేశాను. కానీ అతను అంగీకరించలేదు. ఈ రోజుల్లో దర్శకులు తమ తప్పిదాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు.
చివరకు సినిమా విడుదలయ్యాక నా ప్రశ్నలే క్రిటిక్స్ నుంచి కూడా వచ్చాయి.’ అన్నారు చంద్రశేఖర్. ఇదిలావుంటే.. రీసెంట్గా లోకేష్ కనకరాజ్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నా వరకు ‘లియో’ ఓ అద్భుతం. అవకాశం ఉంటే ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీగా ఉన్నాను. విజయ్ ప్రస్తుతం పాలిటిక్స్‌పై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఆయన సినిమా చేసే అవకాశం ఉంటే.. ‘లియో 2’ కథ చెబుతాను. దానికి ‘పార్తీబన్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నా. ఇది ‘లియో’కు వందరెట్లు గొప్పగా ఉంటుంది.’ అంటూ చెప్పుకొచ్చారు లోకేష్ కనకరాజ్.