Veera Dheera Sooran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం వీరధీరసూరన్ (Veera Dheera Sooran). చిత్త (చిన్నా) ఫేం ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఛియాన్ 62గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ టీజర్ లాంచ్ చేశారని తెలిసిందే. ఈ సారి విక్రమ్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడని టీజర్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త లుక్ షేర్ చేశాడు విక్రమ్. డీవోపీ తెని ఈశ్వర్ ఐఫోన్లో ఈ స్టిల్ తీశాడు.. తాజా పోస్టర్ షేర్ చేశాడు విక్రమ్. దుషారా విజయన్, విక్రమ్ హాఫ్ ఫేస్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. విక్రమ్ టీం మరి దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన చేస్తుందేమో చూడాలి.
ఇప్పటికే దుషారా విజయన్ లుక్ కూడా రిలీజ్ చేయగా.. ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతున్నట్టు తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
DOP Theni Easwar 📸 (shot on an iphone!!) #VeeraDheeraSooran pic.twitter.com/ZsaY8uO2wX
— Vikram (@chiyaan) October 14, 2024
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!