Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి రాజాసాబ్ (Raja Saab). మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హార్రర్ కామెడీ జోనర్లో వస్తోంది. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ త్వరలోనే షురూ కానున్నాయని తెలిసిందే.
నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది. ఈ విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ తెలియజేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ స్నీక్ పీక్ వరల్డ్ గ్లింప్స్ వీడియోను లాంచ్ చేయనున్నట్టు చిట్ చాట్‌లో చెప్పారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందని, అనంతరం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉండబోతున్నాయన్నారు.
ఇప్పటికే విడుదల చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న సీన్లు అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్