Ka | రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం సూపర్ ఫేం సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పటిదాకా తెలుగు మార్కెట్‌కే పరిమితమైన ఈ కుర్ర హీరో ఇక పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టాడు. కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం క (KA). 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా కథాంశంతో వస్తోంది.
ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పదునైన పొడవాటి కత్తి చేత పట్టగా.. బ్యాక్ డ్రాప్లో త్రిశూలాలు కనిపిస్తున్న స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఇప్పటికే మేకర్స్ లాంచ్ చేసిన క కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
.@Kiran_Abbavaram Periodic Thriller #KA #KADiwali #KAOnOct31st !! pic.twitter.com/uORufCqSEe
— BA Raju’s Team (@baraju_SuperHit) October 14, 2024
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్