న్యూఢిల్లీ, మార్చి 7: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి దాని మాతృ సంస్థ అల్ఫాబెట్ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. రాబోయే మూడేండ్లకుగాను దాదాపు రూ.6,362 కోట్లు (692 మిలియన్ డాలర్లు) ఈ భారత సంతతి టెక్కీ అందుకోనున్నారు. దీంతో ప్రపంచంలో అత్యంత ఎక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల్లో పిచాయ్ కూడా ఒకరయ్యారిప్పుడు. 2015 ఆగస్టులో గూగుల్ సీఈవోగా పిచాయ్ ఎన్నికైన దగ్గర్నుంచి సంస్థ మార్కెట్ విలువ 7రెట్లు ఎగిసింది. 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. జనవరిలో 4 ట్రిలియన్ డాలర్ల మార్కును కూడా తాకడం గమనార్హం. ఇక ఈ 53 ఏండ్ల పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరారు.