హైదరాబాద్, మార్చి 7: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ నిర్వహణ సంస్థ వండర్లా..మహిళలకు ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు ఒక్క టికెట్ కొనుగోలు చేసిన వారికి మరో టికెట్ ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఈ నెల 8న మాత్రమే అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. మరోవైపు, పదేండ్ల కంటే అధిక వయసువున్న పురుషులకు ఈ ఆదివారం పార్క్ లోపు అనుమతి లేదని వెల్లడించింది.