న్యూఢిల్లీ, మార్చి 7: ఈ-కామర్స్ దిగ్గజం మీషోకు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,500 కోట్ల ఆదాయ పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తామని వెల్లడించింది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్టాక్ ఎక్సేంజ్కు సమాచారం అందించింది.