RS Praveen Kumar | వరుస వివాదాల నేపథ్యంలో హైకోర్టు (High Court) హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను(Ranganath) తొలగించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రంగనాథ్ మీదున్న 63 కోర్టు ధిక్కరణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయ స్థానం ఇన్ని ఉల్లంఘలనకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని, రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని..హైకోర్టు వద్దని చెప్పినా చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా పేదల ఇళ్లను క్రూరంగా కూల్చిందన్నారు. కోర్టుకు సెలవులు ఉన్న రోజు శని, ఆదివారాలు చూసుకొని వేలాది మంది పోలీసులను తీసుకొని పేదలు నిద్రిస్తున్న సమయంలో ఇళ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు తోడ్పాటు ఇచ్చే విధంగా హైడ్రా పని చేసిందని ఫైర్ అయ్యారు. అన్ని చెరువులను కాపాడే హైడ్రా మాత్రం దుర్గం చెరువు పక్కన ఉండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి ఇంటిని మాత్రం ముట్టుకోలేదని.. కేవలం పేదల మీద మాత్రమే హైడ్రా కర్కశంగా వ్యవహరించిందని అన్నారు.
భూ కబ్జాలపై విచారణకు ట్రిబ్యునల్..
మీరు చట్ట ప్రకారమే ఉద్యోగం చేయండి.. మీరు రేపు ఆ సీటు నుంచి బయటకు పోయినా.. మళ్లీ మీరు రాసిన ఫైళ్ల మీద సోదాలు జరుగుతయి. రేవంత్ రెడ్డి మాట విని చట్టవ్యతిరేకంగా వ్యవహరించకండని ప్రభుత్వ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై చేసిన భూ కబ్జాలపై విచారణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఆ విచారణలో భాగంగా ఈరోజు చట్టవిరుద్ధంగా వ్యవహరించే అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి.
హైకోర్టు వద్దని చెప్పినా చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా పేదల ఇళ్లను క్రూరంగా కూల్చింది.
కోర్టుకు సెలవులు ఉన్న రోజు శని, ఆదివారాలు చూసుకొని వేలాది మంది పోలీసులను తీసుకొని పేదలు నిద్రిస్తున్న సమయంలో ఇళ్లను నేలమట్టం… https://t.co/lTbdHTWSoL pic.twitter.com/xsOBjHl2tE
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
ప్రభుత్వ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక
రేవంత్ రెడ్డి మాట విని చట్టవ్యతిరేకంగా వ్యవహరించకండి
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై చేసిన భూ కబ్జాలపై విచారణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం
ఆ విచారణలో భాగంగా ఈరోజు చట్టవిరుద్ధంగా వ్యవహరించే… https://t.co/yDllI0o0aJ pic.twitter.com/RXePe0VDGj
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026