Commonwealth Games | పట్టువదలని జ్ఞానేశ్వరి.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతంతో మురిసిందిలా..!
Commonwealth Games : ఇప్పటికే మీరాబాయి చాను, రిషికాంత సింగ్, రాజా ముత్తుపాండీలు మెడల్స్ సాధించగా.. జ్ఞానేశ్వరీ యాదవ్ (Jnaneshwari Yadav) దేశానికి వెండి పతకం అందించింది.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే మీరాబాయి చాను, రిషికాంత సింగ్, రాజా ముత్తుపాండీలు మెడల్స్ సాధించగా.. జ్ఞానేశ్వరీ యాదవ్ (Jnaneshwari Yadav) దేశానికి వెండి పతకం అందించింది. 53 కిలోల విభాగంలో జ్ఞానేశ్వరి ఈ మెడల్ సాధించింది. సోమవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో నైజీరియా లిఫ్టర్‌కు దాదాపు సరిసమానంగా బరువులెత్తిన ఆమె రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
గ్లాస్గోలో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాలు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో మూడు మెడల్స్ రాగా.. సోమవారం జ్ఞానేశ్వరీ యాదవ్ వెండి వెలుగులు విరజిమ్మింది. 53 కిలోల కేటగిరీలో పోటీపడిన తను.. తొలి ప్రయత్నంలో జ్ఞానేశ్వరి యాదవ్ 82 కిలోలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 85, మూడోసారి 88 కిలోలతో రికార్డు నెలకొల్పింది. అయితే.. కాసేపటికే నైజీరియా లిఫ్టర్ ఒనొమె ఒమొలోలా దిదిహ్ ఏకంగా 90 కిలోలు ఎత్తి ఆధిక్యంలో నిలిచింది.
CWG Day 5 Result | Weightlifting
Khelo India athlete Gyaneshwari Yadav secures Silver Medal with a total lift of 199 kg (88 kg Snatch + 111 kg in Clean & Jerk)
This is her personal best in Total and C&J Performance. #Cheer4Bharat #CWG2026@Media_SAI @IWF_India @IndiaSports… pic.twitter.com/ipcnp3SRqR
— DD News (@DDNewslive) July 27, 2026
స్నాచ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన భారత లిఫ్టర్.. పసిడికి గట్టిపోటీనిచ్చింది. అనంతరం కీలకమైన జెర్క్ అండ్ స్నాచ్ విభాగంలో ఆమె 103 కిలోలు లిఫ్ట్ చేసింది. ప్రత్యర్థి ఒనొమె కూడా 105 కిలోలు ఎత్తడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక రెండోసారి జ్ఞానేశ్వరి 107 కిలోలు ఎత్తింది. చివరి అటెంప్ట్‌లో ఇద్దరూ 111 కిలోలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొత్తంగా 199 కిలోల బరువులుఎత్తిన జ్ఞానేశ్వరి రెండో స్థానంలో నిలిచి రజతంతో యావత్ దేశం గర్వపడేలా చేసింది.
🥈 From Chhattisgarh to the Commonwealth Games Podium! 🇮🇳💪
Gyaneshwari Yadav has added another major medal to her growing resume, clinching silver in the Women’s 53kg weightlifting at #CWG2026.
Her recent achievements speak for themselves:
🥈 Commonwealth Games 2026 (199kg)
🥉… pic.twitter.com/yhauCF2sF8— myKhel.com (@mykhelcom) July 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

