Honeymoon Express | కుమారి 21 ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించింది హెబ్బా పటేల్. ఈ భామ చైతన్యరావుతో కలిసి నటించిన మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (Honeymoon Express). బాల రాజశేఖరుని కథనందిస్తూ దర్శకత్వం వహించాడు. కజూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అయితే ఆ తర్వాత 2 నెలల అనంతరం ఓటీటీ మూవీ లవర్స్ కోసం ఆగస్టు 27న డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్ నాన్ స్టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఓటీటీలో ప్రీమియర్ అయినప్పటి నుంచి ప్రేమ, పెండ్లి, విడాకుల కాన్సెప్ట్‌తో యూత్‌ను ఆకట్టుకునే కథనంతో ఇంప్రెసివ్‌గా సాగుతూ మంచి మార్కులు కొట్టేస్తూ.. టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. ఈ మూవీ 70 మిలియన్ల మినిట్స్‌కుపైగా వ్యూస్ నాన్‌స్టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో వార్తల్లో నిలుస్తున్న సినిమా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
థియేటర్లలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడంలో కొంచెం వెనుకబడ్డ ఈ చిత్రం ఓటీటీలో మాత్రం ఏదో ఒక వార్తతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ మూవీని ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యూఎస్ఏ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. కళ్యాణిమాలిక్ సంగీతం అందించారు.
Hebah Patel
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్