They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టి.. మధ్యలో పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీ అయ్యాడని తెలిసిందే. చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే హరిహరవీరమల్లు షూట్లో జాయిన్ అయ్యాడు పవన్ కల్యాణ్.
తాజాగా మరో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ (OG) అప్డేట్ కూడా వచ్చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఓజీ టీం షూటింగ్ మూడ్‌లోకి వచ్చేసింది. సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. బ్యాక్ టు ఓజీ.. అంటూ అందమైన లొకేషన్లో క్రేన్ ఉన్న స్టిల్‌ను షేర్ చేశాడు. ఇప్పుడీ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఓజీ టీం ప్రస్తుతం ఎక్కడ ఉందోనంటూ తెగ చర్చించుకుంటున్నారు ఈ స్టిల్ చూసిన సినీ జనాలు.
సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రియారెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఖచ్చితంగా షాట్ పడుతుంది. మా నుండి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ వస్తుంది. సుజీత్ పొగ రాజేయగా.. రవి కె చంద్రన్ దానిని ఎలివేట్ చేశాడు.. అంటూ ఎస్ థమన్ ఇప్పటికే షేర్ చేసిన వార్త ఒకటి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!