Allu Arjun | టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి.. శాండల్‌వుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి.. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతికొద్ది స్టార్ యాక్టర్లలో ఒకడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప సినిమాతో ఇండియావైడ్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ మ్యానరిజానికి ఫిదా అవ్వని మూవీ లవర్స్ లేరంటే అతిశయోక్తి కాదు.
పుష్పరాజ్ రోల్ సౌత్ హీరోకు నార్త్‌లో కూడా సూపర్ పాపులారిటి తెచ్చి పెట్టింది. కాగా తన అభిమాన నటుడు అల్లు అర్జున్ను కలిసేందుకు సైకిల్‌పై ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు వీరాభిమాని. 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి హైదరాబాద్‌లోని నివాసంలో అల్లు అర్జున్ను కలవడం విశేషం. తనపై అభిమానంతో ఇంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేశాడు అల్లు అర్జున్.
ఈ సందర్భంగా సదరు అభిమాని బన్నీతో కలిసి పుష్పరాజ్ స్టైల్లో తగ్గేదేలే డైలాగ్ చెప్పాడు. అభిమాని హుడీపై పుష్ప 2 టైటిల్‌ను చూడొచ్చు. నువ్వు మాత్రం సైకిల్ తొక్కొద్దని.. విమానంలో పంపిస్తానని అభిమానికి చెప్పాడు అల్లు అర్జున్. అభిమానిని దగ్గరుండి క్షేమంగా తిరిగి పంపించాలని తన సిబ్బందికి సూచించాడు. అల్లు అర్జున్ను కలవడం తన జీవితంలో మరిచిపోలేనని ఈ సందర్భంగా అన్నాడు అభిమాని. సైక్లింగ్ మొదలుపెట్టే ముందు చాలా సార్లు హనుమాన్ చాలిసా చదివినట్టు చెప్పాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం pic.twitter.com/2Nr14Gyhmv
— Namasthe Telangana (@ntdailyonline) October 16, 2024
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్