Naga Chaitanya | అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ కథానాయకుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. కాగా నాగచైతన్య షూటింగ్స్ లేనప్పుడు ఇంతకు ముందు కార్ బైక్ రేసింగ్స్లో పాల్గొనేవాడు. ముఖ్యంగా రేస్ కారులను డ్రైవ్ చేయడం అంటే చైతన్యకు మహా ఇష్టం. అయితే గత కొంతకాలం నుండి ఆయన రేసు కారు జోలికి పోవడం లేదట. ఇటీవల నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తెలియజేశాడు.
”నాకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త రకం బైక్ ఏది కనిపించినా వెంటనే డ్రైవ్ చేయాల్సిందే. సినిమాల్లోకి నా ఎంట్రీ ముందు అంటే జోష్ సినిమా కంటే ముందు ఒక స్పోర్ట్స్ కారు తెప్పించాను. ఏ మాత్రం విరామం దొరికినా ఆ కారుపై షికార్లు కొట్టేవాడ్ని. అయితే సినిమాలతో బిజీగా మారిన తరువాత స్లోగా ఆ అలవాటు తగ్గించుకోవాలనుకున్నాను. ఎందుకుంటే రేసు కారు అంటే ఎంతటి స్పీడుతో వెళ్లాల్సి వస్తుందో అందరికి తెలిసిన విషయమే. అంత వేగంతో ట్రావెల్ చేయడం మంచిది కాదు అని నా స్నేహితులు, శ్రేయోభిలాషులు చెప్పడంతో దీనితో పాటు నాపై ఇంతమంది నిర్మాతలు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు. నేను ఏ మాత్రం ఏమరుపాటుగా వున్న షూటింగ్లకు అంతరాయం జరగడంతో పాటు ఆ పొరపాటు నా వ్యక్తిగత జీవితంపై కూడా పడుతుంది. నిర్మాతలకు కూడా నష్టం వాటిల్లుతుంది. అందుకే రేసు కారు అనే ఆలోచన ఇప్పుడు నాలో రావడం లేదు. ఎప్పుడన్నా ఒకసారి చేసినా.. చాలా జాగ్రత్తగా లిమిట్ స్పీడుతో తగు జాగ్రత్తలు తీసుకోని చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలియజేశారు