Pawan Kalyan | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు యాక్టర్‌గా.. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ఏకకాలంలో రెండు విధులు నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే ఏపీ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం సినిమాల షూటింగ్స్ మళ్లీ రీస్టార్ట్ చేశాడు. ఇప్పటికే హరిహరవీరమల్లు, ఓజీ సినిమాల చిత్రీకరణ మొదలైందని వార్తలు కూడా వచ్చాయి.
తన విధులకు ఆటంకం కలగకుండా చూసుకుంటూనే.. మరోవైపు షూటింగ్లో పాల్గొనేందుకు విజయవాడకు సమీపంలో హరిహరవీరమల్లు కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఇక మరోవైపు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఓజీ (Ustaad Bhagat Singh) షూట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన యాక్షన్ పార్టును చిత్రీకరించనున్నారట. ఈ క్రమంలో ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ (OG ) సినిమా షూట్‌పై కూడా అభిమానుల్లో ఆశలు పెరిగిపోతున్నాయి.
పవన్ కల్యాణ్ చాలా కాలం క్రితమే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్లో పాల్గొనగా.. ప్రస్తుతం మేజర్ పోర్షన్లు పెండింగ్‌లో ఉన్నాయట. ఈ నేపథ్యంలో ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కూడా మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇదే నిజమైతే పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రకటించే లోపు కాల్షీట్లు కేటాయించే చివరి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కానుందంటూ ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. మరి పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ టీం నుంచి కొత్త అప్డేట్ ఏమైనా వస్తుందా.. ? అనేది చూడాలి.
Allu Arjun | పుష్పరాజ్ క్రేజ్.. అల్లు అర్జున్ను కలిసేందుకు సైకిల్‌పై 1600 కిలోమీటర్ల ప్రయాణం
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?