Pradeep Machiraju 2 | యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి.. హీరోగా మారిన వారి జాబితాలో ముందు వరుసలో ఉంటాడు ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju). 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రదీప్‌కు హీరోగా మంచి మార్కులే పడ్డాయి. చాలా రోజుల తర్వాత రెండో సినిమాను ప్రకటించేశాడు ఈ స్టార్ యాంకర్.
ప్రదీప్ ఈ సారి పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌పైనే కన్నేశాడు. ప్రదీప్ నటిస్తోన్న తాజా చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi). ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
ఓ వైపు అందమైన ఊరు, మరోవైపు ఆయుధాలు చేత బట్టిన గ్రామస్థులు, క్లాస్ రూంలో ప్రదీప్, ఇంట్లో హీరోయిన్ కనిపిస్తున్న విజువల్స్‌తో కట్ చేసిన మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం ప్రేమ కథ నేపథ్యంలో ఉండబోతుందని హింట్ ఇచ్చేసినట్టు మోషన్ పోస్టర్ చెబుతుండగా.. మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
మోంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానిక ఇఏ రాధన్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ – భరత్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మోషన్ పోస్టర్..
.#PradeepMachiraju2 is #AkkadaAmmayiIkkadaAbbayi / #అక్కడఅమ్మాయిఇక్కడఅబ్బాయి ❤️🔥
▶️ https://t.co/JE4sNxz1N3#AAIA pic.twitter.com/vvHiUJze2x— BA Raju’s Team (@baraju_SuperHit) October 17, 2024
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్