Rakul Preet Singh | తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ ప్రస్తుతం సీక్వెల్ ప్రాజెక్ట్ De De Pyar De 2లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. కాగా ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్న తన డైలీ లైఫ్‌లో జిమ్ సెషన్‌కు మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో వర్కవుట్స్ సెషన్లో భాగంగా బెల్ట్ కూడా వాడకుండా ఏకంగా 80 కిలోల బరువెత్తింది. దీంతో వెన్ను నొప్పి మొదలైంది. అయినా లెక్కచేయకుండా వర్కవుట్స్ చేయడంతో వెన్ను నొప్పి ఎక్కువైంది. డాక్టర్లను సంప్రదించగా. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది.
అందరికీ హాయ్..నేనొక పిచ్చి పనిచేశా. నా బాడీని పట్టించుకోలేదు. వెన్నునొప్పి ఉన్నా పట్టించుకోకపోవడంతో.. నొప్పి ఎక్కువవడంతో ఆరు రోజులుగా బెడ్‌పైనే ఉన్నా. నేను పూర్తిగా కోలుకునేందుకు వారం రోజులు పట్టే అవశాశముందని చెప్పుకొచ్చింది.
నేనిలా మంచానికే పరిమతమవడం ఏం బాగాలేదు. వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మన బాడీ ఏదైనా సిగ్నల్స్ ఇచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లొద్దని తెలుసుకున్నా. నా ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మెసేజ్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానంది రకుల్ ప్రీత్ సింగ్.
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్
Allu Arjun | పుష్పరాజ్ క్రేజ్.. అల్లు అర్జున్ను కలిసేందుకు సైకిల్‌పై 1600 కిలోమీటర్ల ప్రయాణం
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య