Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్
Nidhhi Agerwal | ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ భామ ఖాతాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu), ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ సినిమాలున్నాయి. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరి హర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Nidhhi Agerwal | ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ భామ ఖాతాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu), ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ సినిమాలున్నాయి. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరి హర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు రాజాసాబ్ షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది నిధి అగర్వాల్. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా షేర్ చేసుకుంది. కళాకారుల జీవితం సర్ప్రైజ్లతో నిండి ఉంటుంది. కానీ కొందరు మమ్మల్ని నిజంగా ఆశీర్వదించినట్టు.. కృతజ్ఞతతో అనుభూతి చెందేలా చేస్తారు.
ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలను ఒకే రోజున షూట్ చేసినందుకు సంతోషిస్తున్నా. అది కూడా ఒక సినిమా ఆంధ్రాలో.. మరో సినిమా తెలంగాణలో. రెండు రాష్ట్రాలు, ఒకే రోజు రెండు సినిమా షూటింగ్స్. మేమంతా ఏం చేశామో చూడాలని మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు వేడుకగా జరుపుకునేలా ఉండబోతుతున్నాయని ట్వీట్ చేసింది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో హరిహర వీరమల్లు రెండు పార్టులుగా వస్తోంది. మారుతి డైరెక్టర్ చేస్తున్న రాజాసాబ్ హార్రర్ కామెడీ జోనర్లో వస్తోంది.
An artists life is full of surprises, but some leave you feeling truly blessed and grateful. I’m delighted to have shot for 2 much waited pan-Indian films on the same day, that too one in Andhra and another in Telangana
1 day 2 film shoots 2 states 🤗
Eagerly waiting for you all…— Nidhhi Agerwal (@AgerwalNidhhi) October 17, 2024
Read Also :
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

