మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 23: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి కౌసర్ జహాన్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు, నిర్వహణ తదితర అంశాలపై అధికారిణితో సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ముఖాముఖి నిర్వహించింది. ఈ నెల 25నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం పరీక్షల కోసం 90 రోజుల ప్రణాళిక రూ పొందించుకుని విద్యార్థులను సన్నద్ధం చేశామన్నారు. ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి నమూనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గతేడాది కంటే ఈసారి మరింత ఉత్తీర్ణ త శాతం పెంచేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారా?
డీఐఈవో : ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్యా కోర్సులకు మొత్తం 21,884 వేల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించాం. పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలు, గాలి వెలుతురు సరిగ్గా ఉన్న భవనాలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశాం. ఆహ్లాదకరంగా విద్యార్థులు పరీక్షలు రా సేందుకు అన్ని చర్యలు చేపట్టాం.
నమస్తే తెలంగాణ : జిల్లాలో ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు?
డీఐఈవో : జిల్లాలో 35 కేంద్రాలు ఏర్పాటు చేశాం.
నమస్తే తెలంగాణ : ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇచ్చే విషయమై కచ్చితంగా బకాయీలు చెల్లించాల్సిందేనని, ప్రిన్సిపాల్ సంతకం ఉం టేనే పరీక్షలకు అనుమతిస్తారంటూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.?
డీఐఈవో : ఇక నుంచి ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు అలాంటి సమస్య ఉత్ప న్నం కాదు. మీసేవ, ఆన్లైన్ కేంద్రాల ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా వెబ్సైట్లోకి వెళ్లి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి ఉండాలనే నిబంధన లేదు. ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా విద్యార్థులకు పరీక్షలకు అనుమతిస్తాం.
నమస్తే తెలంగాణ : కాపీయింగ్‌కు పాల్పడకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?
డీఐఈవో : ప్రతి పరీక్షా కేంద్రంలో విధిగా 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.విద్యార్థులు, సిబ్బంది, చీఫ్ సూపరింటెండెంట్ కు సైతం సెల్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అ నుమతి లేదు. ప్రతి గదిలో గోడగడియారం ఉంటుం ది. ఒకవేళ ఎవరైనా అధికారులు సెల్‌ఫోన్ సెంటర్‌కు తీసుకొస్తే.. పోలీసుల వద్ద డిపాజిట్ చేయాల్సిందే.! మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా రెండు ప్లయింగ్ స్కాడ్, 6 సిట్టింగ్ స్కాడ్స్ బృం దాలను నియమించాం.
నమస్తే తెలంగాణ : విద్యార్థులకు మీరిచ్చే సలహా, సూచనలు ఏమైనా ఉన్నాయా?
డీఐఈవో : విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు హాజరు కావాలి. కేంద్రాల చిరునామాను ముందే ఒకసారి వెళ్లి చూసుకుంటే మంచిది. ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలి. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూం ఫోన్ :9441273176 నెంబర్ ను సంప్రదించాలి.