Suriya | ప్రయోగాత్మక సినిమాలు చేసే అతికొద్ది మంది స్టార్ యాక్టర్లలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఒకరు. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ సూర్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య చిట్ చాట్‌లో చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కంగువ గురించి సూర్య మాట్లాడుతూ..ఉత్తమమైన సినిమాలకు అందించేందుకు ఎప్పుడూ గజినీ, సింగం, 24, జై భీమ్ లాంటి సినిమాలు చేసే ప్రేరణతో మాకు మేం ముందుకెళ్తుంటాం.
కంగువ లాంటి సినిమాను మనలో ఎవరూ చూడలేదు. 300, బ్రేవ్ హర్ట్ సినిమాలు చూసి అద్భుతంగా ఉన్నాయంటాం. భారతీయ సినిమాలెందుకు అలా ఉండకూడదు. నా దర్శకుడు శివ విజువల్స్ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. 170 రోజులు షూట్ చేశాం. కంపర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా కంగువ. మీ అందరి నుంచి అదే ప్రేమను పొందుతామని ఆశిస్తున్నానన్నాడు సూర్య. ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
NBK 109 | క్రేజీ న్యూస్.. చౌటుప్పల్‌లో బాలకృష్ణ ఎన్బీకే 109 షూటింగ్.. !
Mrunal Thakur | ఫ్యాషన్ వీక్‌కే ప్రత్యేక ఆకర్షణగా.. ర్యాంప్‌పై మృణాళ్ ఠాకూర్ మెరుపులు