Suraj Venjaramoodun | ఈ ఏడాది తంగలాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్. ఈ విలక్షణ నటుడు హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వీరధీరసూరన్ (VeeraDheeraSooran). ఛియాన్ 62గా వస్తోన్న ఈ మూవీని చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, మాలీవుడ్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఓ చిట్‌చాట్‌లో సూరజ్ వెంజరమూడు చేసిన కామెంట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. సినిమాలో ఓ స్పెషల్ సీన్ గురించి సూరజ్ వెంజరమూడు మాట్లాడుతూ.. విక్రమ్, ఎస్జే సూర్య, నాపై ప్రత్యేకంగా ఓ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశం మొత్తాన్ని 18 నిమిషాల వ్యవధిలో సింగిల్ షాట్లో చేయడం చాలా ఎక్జయిటింగ్‌గా అనిపించే విషయం. నేను ఇదివరకెన్నడూ ఇలాంటి సన్నివేశాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదన్నాడు. సూరజ్ వెంజరమూడు చేసిన ఈ వ్యాఖ్యలు వీరధీర సూరన్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఇప్పటికే దుషారా విజయన్ లుక్ కూడా రిలీజ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. విక్రమ్ ఈ సారి పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ సినిమాతో వినోదాన్ని అందించబోతున్నాడని టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. వీరధీర సూరన్ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్.
Veera Dheera Sooran
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?