న్యూఢిల్లీ : యాసిడ్ దాడి బాధితుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక విధానాన్ని తీసుకురావాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ఉద్యోగాన్ని కల్పించలేకపోతే, బాధితుల జీవనాధారం ఆర్థిక సాయం కల్పించటంపై ఒక పాలసీ తీసుకురావాలని అభిప్రాయపడింది. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై సూచనలు చేసింది.