భోపాల్, మార్చి 9 : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. 2024లో విజయ్‌పూర్ ఉప ఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎన్నిక చెల్లదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే ముకేశ్ మల్హోత్రా తనపై నమోదైన పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో తెలుపలేదని, దీంతో ఆయన ఎన్నికను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొన్నది.
విజయ్‌పూర్ ఉప ఎన్నికలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రామ్నివాస్ రావత్‌ను విజేతగా ప్రకటిస్తూ గ్వాలియర్ బెంచ్ తీర్పు చెప్పింది. జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ వెలువరించిన తీర్పు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.