Vangalapudi Anitha | ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయ్యింది. శుక్రవారం నాడు ఆమె ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అన్ని ట్వీట్లను తొలగించారు. డీపీ కూడా కనిపించడం లేదు.
FXRP పేరుతో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తూ హోంమంత్రి అకౌంట్లో ఒక స్పామ్ లింక్‌ను ట్వీట్ చేశారు. ఎర్లీ కాంట్రిబ్యూటర్ రివార్డ్స్ అనే పేర్కొనడం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం ఇది గమనించిన హోంమంత్రి అనిత కార్యాలయ సిబ్బంది అనకాపల్లి జిల్లా నకకపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై వంగలపూడి అనిత.. సైబర్ క్రైం ఐజీ రవికృష్ణతో మాట్లాడారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హ్యాకింగ్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.