Liquor shops: సీజేపీ ఆందోళనలు.. ఢిల్లీలో రాత్రి 8 గంటలకే లిక్కర్ షాపులు బంద్
Liquor shops: మద్యం షాపులను ముందుగానే మూసివేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులను తెరవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం షాపుల(Liquor shops)ను ముందుగానే మూసివేయాలని నిర్ణయించింది. రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులను తెరవనున్నట్లు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో లిక్కర్ షాపులకు చెందిన సమయాన్ని కుదిరించారు. గురువారం అకస్మాత్తుగా మద్యం షాపులను ఢిల్లీలో రాత్రి 8 గంటలకే మూసివేశారు. దీంతో లిక్కర్ కోసం జనం తికమకపడ్డారు. సాధారణంగా సిటీలో మద్యం షాపులను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అయితే ఈ వారాంతం వరకు మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం పార్లమెంట్ మార్చ్ సమయంలో హింస చోటుచేసుకున్నది. అనేక మంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తిననారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

