Donald Trump | ఇరాన్‌పై ఇప్పుడప్పుడే భారీ దాడులు ఉండవు.. ఎందుకంటే.. : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ఇరాన్ (Iran) తో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై భారీస్థాయి మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించే అంశంపై తాను ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం అమెరికాతో చర్చల విషయంలో టెహ్రాన్ యంత్రాంగం ‘చాలా తీవ్రంగా’ ఆలోచిస్తోందని ఆయన చెప్పారు.
Donald Trump : ఇరాన్ (Iran) తో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై భారీస్థాయి మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించే అంశంపై తాను ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం అమెరికాతో చర్చల విషయంలో టెహ్రాన్ యంత్రాంగం ‘చాలా తీవ్రంగా’ ఆలోచిస్తోందని ఆయన చెప్పారు.
ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌కు రెండు మార్గాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఒకటి తమతో శాంతి ఒప్పందానికి రావడం, లేదా మునుపటి కంటే తీవ్రమైన క్షిపణి దాడులను ఎదుర్కోవడమని అన్నారు. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయకుండా నిరోధించేందుకే తాము గత రెండు వారాలుగా దాడులు చేస్తున్నామని, దీనికి ప్రతిగా ఇరాన్ జరిపిన దాడుల్లో నలుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
తమ సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, కానీ ప్రస్తుతం చర్చలు సాగుతున్నందున కాబట్టి ఫలితం ఏమొస్తుందో వేచి చూస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ గనుక అణు ఆయుధాలను తయారుచేసే స్థాయికి చేరుకుంటే అది తమ సహనానికి ‘రెడ్ లైన్’ అవుతుందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌కు చైనా, రష్యా నిఘా సహకారాన్ని, ఆయుధాలను అందిస్తున్నాయన్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. రష్యా, చైనా అధ్యక్షులు ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని తనకు హామీ ఇచ్చారని, వారి మాటపై తనకు నమ్మకముందని ట్రంప్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

