Pawan Kalyan Titles | సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోల సినిమాల టైటిల్స్ (Titles) కు సూపర్ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవరం లేదు. కొన్ని టైటిల్స్నైతే మూవీ లవర్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటి సూపర్ క్రేజీ టైటిల్స్‌తో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi), తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, అత్తారింటికి దారేది, తీన్మార్, జల్సా.. ఇలా టైటిల్స్ ఎక్కడో ఒక చోట రిపీట్ అవుతూ ఉంటాయి.
అయితే పవన్ కల్యాణ్ టైటిల్స్‌తో కొత్త సినిమాలు వస్తుండటంతో కొందరు అభిమానులు హ్యాపీగా ఉంటే.. మరొకొందరేమో నిరాశచెందుతున్నారట. ఇంతకీ టైటిల్స్ విషయం తెరపైకి రావడానికి కారణం.. యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటిస్తోన్న రెండో చిత్రానికి పవన్ కల్యాణ్ డెబ్యూ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ పెట్టడం. అయితే పవన్ కల్యాణ్, టైటిల్ క్రేజ్ కొత్తగా వస్తున్న సినిమాలకు బజ్ పరంగా కలిసొచ్చే అంశంమైనప్పటికీ కొన్ని సార్లు టైటిల్స్ బెడిసికొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ టైటిల్స్‌ను ఓ వైపు మెగా హీరోలు వాడుతుండగా.. మరోవైపు ఇతర హీరోలు కూడా తమ సినిమాలకు పెట్టుకుంటున్నారని తెలిసిందే.
అయితే టైటిల్స్ రిపీట్ చేసిన మెగా హీరోల సినిమాలను.. పవన్ కల్యాణ్ సినిమాలతో పోల్చడం తద్వారా అంచనాలు పెరిగిపోతానయడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మిగితా హీరోల విషయానికొస్తే మాత్రం టైటిల్స్ రిపీట్ చేసుకోవడం వారి వారి సినిమాకు మార్కెట్ పరంగా బాగా కలిసొచ్చే విషయమేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
కొన్ని అంశాల పరంగా టైటిల్స్ రిపీట్ చేయడం ఇబ్బందికర విషయమే అయినా.. చాలా విషయాల పరంగా చూసుకుంటే పవన్ కల్యాణ్ స్టార్డమ్ మాత్రం బాగా కలిసొచ్చే విషయమేనని అంటున్నారు. ఇంకేంటి ఈ లెక్కన టైటిల్స్ పునరావృతం అయ్యే విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నమాట.
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్