Salaar | ప్రభాస్ (Prabhas) కెరీర్లో సలార్ (Salaar) వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రాంచైజీగా తెరకెక్కుతుండగా.. ఇప్పటికే గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన Salaar Part-1 Ceasefire బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా తన రేంజ్ ఏంటో చూపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ క్రేజీ సినిమా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. సలార్ హిందీ వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్- 2024 జాబితాలో 30 మిలియన్లకుపైగా వ్యూయర్స్‌తో టాప్ 3 స్థానంలో నిలిచింది. అంతేకాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో గత ఎనిమిది నెలల నుంచి టాప్ 10లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకీ ఏ స్థాయిలో పెరిగిపోతుందో ఈ ఒక్క అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
మరోవైపు సలార్ ఈ ఏడాది జులై 5న జపనీస్ భాషలో విడుదలైందని తెలిసిందే. సలార్ జపనీస్ వెర్షన్ Hulu Japan లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, రాజాసాబ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా… జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ , బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్లో కొత్తగా యాక్టర్లు ఎవరైనా యాడ్ అవుతారా..? అనేది తెలియాల్సి ఉంది. సలార్ హాట్ స్టార్‌లో 16.5 మిలియన్ల వ్యూస్‌తో టాప్ 5లో నిలువగా.. నెట్‌ఫ్లిక్స్‌లో 12.3 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.
#Salaar (Hindi) is a BEAST!! 🔥🔥🔥
Ranked Top #3 TV Premieres of 2024 with 30M+ viewers 💥
Completes 200 consecutive days in Top 10 Trending 💥
Still trending at #5 on Hotstar with 16.5M views, 12.3M views on Netflix 💥
The sequel is gonna create RIOTS at the box office 🎬 pic.twitter.com/Pa7G7Rnpus
— BFilmy Official (@BFilmy_Official) October 17, 2024
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్