Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది టీం. కాగా లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ అందించారు. ఈ మూవీ ట్రైలర్‌ను రేపు లాంచ్ చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ డీసెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో.. అతడొక సాధారణ వ్యక్తి. సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో ఇంత డబ్బా.. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్‌లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ట్రైలర్ అప్డేట్ లుక్..
.@dulQuer #LuckyBaskharTrailer From Tomorrow!! #LuckyBaskharOnOct31st #LuckyBaskhar !! #DulquerSalmaan pic.twitter.com/hjMYK9ACNB
— BA Raju’s Team (@baraju_SuperHit) October 20, 2024
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
VD 12 | ఫ్యాన్స్ మీట్లో విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడంటే..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా