VD 12 | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి వీడీ 12 (VD 12). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బ్రేక్ సమయంలో అభిమానులను కలిసేందుకు ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశాడు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమ ఫేవరేట్ హీరోలతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు అభిమానులు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
పాపులర్ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ (Gireesh Gangadharan) ఈ చిత్రానికి పనిచేస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.
అభిమానులతో ఇలా..
#VijayDeverakonda about #VD12 Kerala Schedule @TheDeverakonda pic.twitter.com/xNBNYRzm2N
— Suresh PRO (@SureshPRO_) October 18, 2024
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్