ముంబై, మార్చి 9 : మహారాష్ట్రలో 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు చాట్‌జీపీటీ వాడుతూ మోసానికి పాల్పడిన సంగతి వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో విద్యార్థులకు సహకరించారన్న కారణంతో బీడ్ జిల్లాలో 81 మంది టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బోర్డ్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఎడ్యుకేషన్ బోర్డ్ వివిధ జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకుంది. అయితే అత్యధిక సంఖ్యలో సస్పెన్షన్లు బీడ్ జిల్లాలో నమోదయ్యాయి.
10, 12 తరగతుల పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్‌కు పాల్పడటం, దీంట్లో ఉపాధ్యాయుల ప్రమేయం వెలుగులోకి వచ్చిందని ఉన్నతాధికారులు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనల్ని ఆపడానికి బోర్డ్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.