Donald Trump | హర్మూజ్‌పై సంపూర్ణ అధికారం మాదే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ (Iran) కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఆ దేశంతో జరుగుతోన్న చర్చలపై తమకు నమ్మకం లేదని, వారు ఎప్పుడూ తనకు అబద్ధాలే చెబుతారని అన్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై సంపూర్ణ నియంత్రణ అమెరికాకే ఉందని అన్నారు. ప్రస్తుతం జలసంధి తమ అధీనంలోనే ఉందని చెప్పారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ (Iran) కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఆ దేశంతో జరుగుతోన్న చర్చలపై తమకు నమ్మకం లేదని, వారు ఎప్పుడూ తనకు అబద్ధాలే చెబుతారని అన్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై సంపూర్ణ నియంత్రణ అమెరికాకే ఉందని అన్నారు. ప్రస్తుతం జలసంధి తమ అధీనంలోనే ఉందని చెప్పారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గినా, దుందుడుకు చర్యలకు పాల్పడినా కఠిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధిలో ఒమన్ వద్ద ఓ నౌకపై అమెరికా దాడి చేసింది. ఇరాన్ రేవులపై తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. పనామా జెండా కలిగిన ‘వేలా నోవా’ కార్గో నౌకపై నేవీ హెలికాప్టర్ రెండు హెల్ఫైర్ క్షిపణులను ప్రయోగించిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడిలో సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అనే విషయాన్ని వెల్లడించలేదు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పనామా కాల్వలో నౌకల రద్దీ పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో ఎల్‌నినో ప్రభావంవల్ల కాలువలో నీటి మట్టం తగ్గుతున్నట్లు పేర్కొన్నాయి. దాంతో దానిగుండా ప్రయాణించే ఒక్కో వాణిజ్య నౌక నుంచి పనామా కాలువ అథారిటీ నాలుడు మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తెలిపాయి. ఓ భారీ నౌక పనామా దాటాలంటే 10 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

