Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Bulgaria Accident | దట్టమైన పొగమంచు (Fog) కారణంగా ఒకే కూడలిలో 86 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. బల్గేరియా (Bulgaria) లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని సోఫియా (Sofia) ను బుర్గాస్ ఓడరేవు (Burgas port) తో కలిపే రోడ్డుపై మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
Bulgaria Accident : దట్టమైన పొగమంచు (Fog) కారణంగా ఒకే కూడలిలో 86 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. బల్గేరియా (Bulgaria) లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని సోఫియా (Sofia) ను బుర్గాస్ ఓడరేవు (Burgas port) తో కలిపే రోడ్డుపై మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే యాంబోల్ సమీపంలో ఒకే ప్రదేశంలో అటు, ఇటు ఉన్న రోడ్లపై దాదాపు 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో చాలావరకు ట్రక్కులే ఉన్నాయి.
ఈ ప్రమాదం కారణంగా ఘటనా స్థలంలోనే 10 మంది మృతిచెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 46 మందిని చికిత్స కోసం తరలించారు. సమాచారం అందుకున్న ప్రధాని రుమెన్ రాదేవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ఇలాంటి భయానక దృశ్యాన్ని తాను ఎన్నడూ చూడలేదని ప్రాంతీయ గవర్నర్ మిహైల్ కాషెరోవ్ చెప్పారు. దట్టమైన పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడం, రోడ్డు తడిగా ఉండటం వంటివి ప్రమాదానికి దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

