NBK 109 | నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఎన్బీకే 109 (NBK109). బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్రం కొత్త షెడ్యూల్ గురించి ఆసక్తిక వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అన్‌స్టాపబుల్ సీజన్ 4లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఆదివారం పూర్తయింది. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎన్బీకే 109 షూటింగ్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడు బాలయ్య. తాజా టాక్ ప్రకారం నేడు చౌటుప్పల్‌లో ఎన్బీకే 109 కొత్త షెడ్యూల్ చిత్రీకరణ షురూ అయినట్టు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం.
ఓ వైపు రాజకీయాలు, మరోవైపు పాలిటిక్స్.. ఇంకో వైపు టాక్ షో.. ఆరు పదుల వయస్సు దాటినా ఇలా బ్యాక్ టు బ్యాక్ బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఉన్న బాలకృష్ణ కమిట్మెంట్కు ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్