Sandeep Reddy Vanga | టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Anannya nagalla), యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్ పోషిస్తోన్న చిత్రం పొట్టేల్ (Pottel). ‘సవారీ’ ఫేం సాహిత్ మోత్ఖురి దర్శకత్వం వహిస్తున్నాడు. తన కుమార్తెను చదివించాలనుకునే ఒక గొర్రెల కాపరి కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఫస్ట్ కథ విన్నా.. ఓ చిన్న కథ చేసుకున్నానని చెప్పిండు. కథ విన్న తర్వాత తెలిసింది చిన్న కథ కాదు.. పెద్దది.. సినిమా చూశాచాలా బాగా నచ్చింది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కూడా బాగుంది. అజయ్ మాత్రం భయపెట్టించి వదిలి పెట్టారు. నేను సినిమా చూసిన అని చెప్పట్లేదు. ఇంత బాగా చేస్తారని నేను ఊహించలేదు. ఎందుకంటే చిన్న సినిమా అన్నడు.. నాకు పెద్ద బడ్జెట్ కనిపించింది.
ఎట్ల తీస్తడో అనుకున్న. అతన్ని నమ్మిన నిర్మాత సేఫ్ అని.. పెద్ద మనసుతో చేసిన చూసిన సినిమా ఇది. చూసిన అని డబ్బా కొట్టడం కాదు.. అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడున్న యువ దర్శకుల్లో ఇలా గ్రామానికి వెళ్లి సినిమా తీయడం ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అక్టోబర్ 25న మీ ముందుకొస్తుంది.. అందరూ చిన్న సినిమాను ప్రోత్సహించండని విజ్ఞప్తి చేశాడు.
ఈ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
I recently watched #Pottel and loved it to the core. It’s a film with a big heart!❤️
Watch the powerful speech of dynamic director @imvangasandeep at Pre Release Event🔥🔥
—https://t.co/ch734o3FSZ pic.twitter.com/7fezuAUDQY
— BA Raju’s Team (@baraju_SuperHit) October 21, 2024
Kanguva | అభిమానులతో సూర్య, దిశాపటానీ సెల్ఫీ.. ఇంతకీ కంగువ టీం ఎక్కడుందో తెలుసా..?
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు