Sathyam Sundaram | కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Aravindha Swamy) లీడ్ రోల్స్‌లో నటించిన కోలీవుడ్ ప్రాజెక్ట్ మెయ్యళగన్ (Meiyazhagan). 96 ఫేం ప్రేమ్ కుమార్ సీ (Prem Kumar C) దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదలైంది. తమిళంలో సెప్టెంబర్ 27న, తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.
ఇక ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 27న ప్రీమియర్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సందడి చేయనుంది. కార్తీ, అరవింద్‌స్వామి మధ్య అనుబంధం నేపథ్యంలో భావోద్వేగపూరిత సన్నివేశాలతో సాగే ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీని హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్పై సూర్య- జ్యోతిక రాజశేఖర్, కర్పూర సుందర పాడ్యన్తో కలిసి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజ్ కిరణ్, శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిణి, జయప్రకాశ్, శ్రీరంజిని ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి 96 ఫేం గోవింద్ వసంత సంగీతం అందించాడు.
#Meiyazhagan will be streaming from Oct 27 on NETFLIX ❤️ pic.twitter.com/zHqDiJXYDc
— Christopher Kanagaraj (@Chrissuccess) October 22, 2024
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
సత్యం సుందరం ట్రైలర్..