WI vs IND : సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-11 కీలక మ్యాచ్‌లో తన తడాఖా చూపిస్తున్నాడు. ఒకే ఓవర్లో రెండు బిగ్ వికెట్లు తీసి వెస్టిండీస్‌ను షాక్‌లో పడేశాడు. స్పిన్నర్లు దీటుగా ఆడుతూ సిక్సర్లతో చెలరేగుతున్న షిమ్రన్ హిట్మైర్(27)ను బోల్తా కొట్టించిన యార్కర్ కింగ్.. ఆ తర్వాతి రెండో బంతికే ఓపెనర్ రోస్టన్ ఛేజ్(40)ను పెవిలియన్ పంపాడు. సూర్యకుమార్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకోగా.. 103 వద్ద విండీస్ మూడో వికెట్ పడింది.
సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్నారు. వెస్టిండీస్ ఓపెనర్లకు దంచేందుకు అవకాశమివ్వడం లేదు. దాంతో.. ఆచితూచి ఆడిన షాయ్ హోప్(32), రోస్టన్ ఛేజ్(40)లు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు. ఫలితంగా.. పవర్ ప్లేలో విండీస్ వికెట్ కోల్పోకుండా 45 రన్సే చేయగలిగింది. పవర్ ప్లే తర్వాత బిగ్ షాట్లు ఆడాలనుకున్న షాయ్ హోప్(32)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ సైడ్ ఆడాలనుకున్న హోప్ బంతిని అంచనా వేయలేక బౌల్డయ్యాడు. దాంతో.. 68 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని మిస్టరీ స్పిన్నర్ విడదీశాడు.
Jasprit Bumrah 🤝 Big wickets
He strikes twice in the same over and #TeamIndia have 3️⃣ wickets now 👏
Updates ▶️ https://t.co/ur4pr8Bi3K#T20WorldCup | #MenInBlue | #INDvWI | @Jaspritbumrah93 pic.twitter.com/95fUyaVNik
— BCCI (@BCCI) March 1, 2026
పాండ్యా, వరుణ్ ఓవర్లో సిక్సర్లతో రెచ్చిపోయిన షిమ్రన్ హిట్మైర్(27)ను బుమ్రా వెనక్కి పంపి విండీస్‌కు షాకిచ్చాడు. బుమ్రా సంధించిన షార్ట్ బాల్‌ను హిట్మైర్ లెగ్ సైడ్ ఆడాలనుకోగా బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ సంజూకి చిక్కింది. ఆ తర్వాతి రెండో బంతికే ఛేజ్‌ను డైవింగ్ క్యాచ్‌తో సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు. అంతే.. విండీస్ పరుగుల జోరుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు వికెట్లతో ఒత్తిడిలో పడిన కరీబియన్ జట్టును మరింత షాక్‌కు గురి చేస్తూ.. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(14)ను పాండ్యా వెనక్కి పంపాడు.