Chiranjeevi | నేడు గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)కు పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెబల్ స్టార్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పాడు.
ప్రభాస్ మిర్చి సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను చిరంజీవి గుర్తు చేస్తూ.. ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude.. అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం.. అంటూనే పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్.. ప్రేమానురాగాలతో, సుఖసంతోషాలతో రాబోయే సంవత్సరం గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందాలని కోరుకుంటున్నాను.. అంటూ ట్వీట్ చేశాడు చిరు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండటంతోపాటు ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలను లైన్లో పెట్టాడు. మరోవైపు చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
చిరంజీవి బర్త్ డే విషెస్..
ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. Happy Birthday Darling Prabhas! 💐Wishing you Love , Happiness and Greater Glory! Have A Wonderful year ahead!🤗
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2024
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్