Dulquer Salmaan | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు దుల్కర్ సల్మాన్. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివిధ భాషలతో తనకున్న అనుబంధం గురించి షేర్ చేసుకున్నాడు.
విభిన్న భాషల్లో సినిమాలు చేస్తున్నారు.. మీకు ఏ భాషలో ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది.. అని అడిగారు యాంకర్. దీనికి దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. ప్రాంతాల వారిగా భిన్నమైన సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కేరళ నా మదర్ ల్యాండ్.. నా ప్రజలు.. నా కెరీర్ మొదలైంది. నా బంధుత్వాల విషయంలో చాలా చరిత్ర ఉంది. కేరళ నాకు ఇల్లులాగా అనిపిస్తుంటుంది. ఓ నటుడిగా ఇతర భాషల నుంచి అవకాశాలు వచ్చినా.. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా అది మొదలైంది ఇక్కడేనన్నాడు.
తమిళం విషయానికొస్తే.. నేను చెన్నైలో పెరిగా. తమిళం నా స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్. ఈ భాషపై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఇక తెలుగు భాష మాత్రం వీటన్నింటికంటే చాలా ప్రత్యేకమైంది. తెలుగులో నేను ఊహించని అవకాశాలు వచ్చాయి. మంచి స్నేహితులు, అమితంగా ప్రేమించే వ్యక్తులు. తెలుగు భాషంటే నాకు చాలా మక్కువ. ఎందుకంటే నాకు భాష తెలియదు. నేను ప్రతీరోజు తెలుగుకు సంబంధించి కొత్త పదాలు, వాక్యాలను తెలుసుకుంటుంటా.. తెలుగులో మాట్లాడేవాళ్లను చాలా ఆసక్తిగా గమనిస్తుంటానని దుల్కర్ సల్మాన్ చెప్పాడు.
హైదరాబాద్ సినిమా షూటింగ్స్‌కు, ఫిల్మ్ మేకింగ్‌కు చాలా సపోర్ట్‌గా ఉండే ప్రాంతం. ఇక హిందీలో ప్రతీ ప్రాజెక్ట్ భిన్నమైంది. నా స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. నాకు ఈ భాషతో దగ్గరి అనుబంధం ఉంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియన్ కమ్యూనిటీకి కామన్ లాంగ్వేజ్ హిందీ. నా ఎమిరేట్ గ్రూప్‌లో తమిళ్, మలయాళి, మరాఠి, గుజరాతీ, హైదరాబాదీ.. ఇలా ప్రతీ ఒక్కరున్నారంటూ పలు భాషలతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్.
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్