War 2 | దేవర పార్ట్-1 సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ వార్ 2 (War 2)తో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). స్పై జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా ఇప్పటికే 85వ రోజు వార్ షూట్ కొనసాగుతుందంటూ లొకేషన్ స్టిల్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్టన్నింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తారక్, హృతిక్ రోషన్‌పై వచ్చే కత్తి సాము సీక్వెన్స్ కొనసాగుతుందట. కత్తి సాముతో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ బ్లాక్ గ్రాండ్‌గా ఉండనుందని ఇన్సైడ్ టాక్. చైనాలోని Shaolin Templeలో ఈ ఎంట్రీ సీన్ ఉండనుందట. ఇక ఓ నౌకపై సముద్రపు దొంగలతో ఫైట్ సీక్వె్న్స్తో తారక్ ఎంట్రీ ఉండబోతుందని ఫిలిం నగర్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి.
ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన వార్ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. వార్ 2 YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
WAR 2 – HRITHIK ROSHAN v/s NTR JR – HEATING UP!#AyanMukerji & #AdityaChopra design mega action blocks for the introduction sequences of #HrithikRoshan & #NTRJr in #War2
– #HrithikRoshan set to make an entry with a sword fight at Shaolin Temple 🔥
– #NTRJr to fight pirates… pic.twitter.com/Fn6hiSnBtm
— Himesh (@HimeshMankad) October 23, 2024
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్