Balka Suman |మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌ను మంచిర్యాల జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. బాల్క సుమన్‌ను కస్టడీలోకి తీసుకోవడానికి బలమైన ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది.
మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ , సీపీఐ సభ్యులు కలిసి అత్యధిక సంఖ్యల్లో కౌన్సిలర్లను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించవలసిన పాలకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్ర పన్ని బీఆర్ఎస్ గెలుపొందకుండా అడ్డుకున్నారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌పై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉంచారు. బాల్కసుమన్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసినా విచారణ గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.