Sonam Kapoor | బాలీవుడ్ నటి సోనమ్ కపూర్-ఆనంద్ ఆహూజా కపుల్ The Bhaane Groupను మెయింటైన్ చేస్తున్నారని తెలిసిందే. అయితే ఈ సెలబ్రిటీ కపుల్ ముంబైలోని ఐకానిక్ మ్యూజిక రిటైల్ స్టోర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేశారన్న వార్త ఒకటి బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. రిథమ్ హౌస్‌ను రూ. 47.84 కోట్లకు కొనుగోలు చేశారు.
3600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ నీరవ్ మోదీ చైన్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ రిటైల్ స్టోర్స్ వ్యవస్థాపకుడు, ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీ (పాత యజమాని)బ్యాంకు రుణాల ఎగవేతతో 2018 తర్వాత మూసివేయబడ్డది. భారత దివాళా కోర్టు (Indian bankruptcy court) నియమించిన రిజల్యూషన్ స్పెషలిస్ట్ ఈ విషయాన్ని ప్రకటించారు. రిథమ్ హౌస్‌ను రూ.478.4 మిలియన్లకు విక్రయించే విషయాన్ని వాటాదారుల కమిటీ ఆమోదించింది.
బానే గ్రూప్ ఇప్పటికే ఇండియాలో నైక్, కన్వర్స్ స్టోర్లను నిర్వహిస్తోంది. 1940లలో స్థాపించబడిన రిథమ్ హౌస్.. జెత్రో తుల్ ఇయాన్ ఆండర్సన్, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌తోపాటు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు ఆతిథ్యమిచ్చింది. వినైల్లు, క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్ (CD)లలో తమ అభిమాన కళాకారుల సంగీతాన్ని వినే శకం.. డిజిటల్ స్ట్రీమింగ్ వైపు అడుగులు పడటంతో ఈ ఐకానిక్ స్టోర్ క్రమంగా దాని ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చింది.
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్