Anushka Shetty | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత టాలీవుడ్ భామ అనుష్కా శెట్టి (Anushka Shetty) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ఘాటి (Ghaati). సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతానికి మీడియాకు దూరంగా ఉన్న స్వీటీ కొంతకాలంగా హైదరాబాద్‌లో మాత్రం కనిపించడం లేదు.
కాగా అనుష్కా శెట్టి మాత్రం సైలెంట్‌గా ఘాటి షూటింగ్ పూర్తి చేసిందని ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. క్రిష్ టీం ఇటీవల ఒడిశాలోని కోరాపుట్ జిల్లా అనకడేలి, లంటపుట్, మచకుంద్ ప్రాంతాల్లో ఘాటి చిత్రీకరణ జరిపిందట. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. బోల్డ్-ఇంటెన్స్ పాత్రతో సాగే ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో ఘాటి తెరకెక్కుతోంది. వేదం సినిమా తర్వాత క్రిష్, అనుష్క కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో ఘాటి ప్రీ లుక్ లాంచ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. నేరస్థురాలిగా మారిన బాధితురాలు తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో సినిమా సాగనుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది. అనుష్కా శెట్టి ప్రస్తుతం రొజిన్ థామస్ డైరెక్ట్ చేస్తున్న Kathanar – The Wild Sorcerer సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Ghaati ప్రీ లుక్..
Anushka Shetty’s Film With Krish Is Titled ‘Ghaati’#Ghaati #KrishJagarlamudi #AnushkaShetty #FirstFramesEntertainments #AmazonPrimeVideo #Vamsi #RajivReddy #ChintakindiSrinivasRao #HariHaraVeeraMallu #BurraSaiMadhav pic.twitter.com/FQuWWf9Jh2
— SAI KRISHNA (@SAIKRIS40918887) March 20, 2024
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్