Priyanka Chopra | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా లీడ్ రోల్లో నటించిన చిత్రం Saat Khoon Maaf. ఏడుగురు భర్తలున్న మహిళగా.. ఒకరి తర్వాత మరొకరిని చంపే పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో పాపులర్ నటుడు అన్నూ కపూర్ (Annu Kapoor) ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఐదో భర్తగా నటించగా.. ఇద్దరి మధ్య కొన్ని బోల్డ్ సన్నివేశాలుంటాయి.
తాజా పోడ్కాస్ట్లో సినిమాలో ముద్దు సన్నివేశం గురించి అన్నూ కపూర్ చెప్పిన నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనతో ముద్దు సన్నివేశం విషయంలో ప్రియాంకా చోప్రా ఆలోచనపడిందన్నాడు. డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ నా దగ్గరకు వచ్చి బోల్డ్ కిస్సింగ్ సీన్లో నటించడం అసౌకర్యంగా ఫీలవుతుందని.. ఈ సన్నివేశాన్ని మార్చాలని కోరాడు. తర్వాత సీన్‌ను మార్చేశారు.
హీరోయిన్లు యువ నటులను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారని.. అయితే ఇతరులను కిస్ చేయడానికి మాత్రం సిగ్గుపడతారని అన్నూ కపూర్ చెప్పుకొచ్చాడు.
Raja Saab | డ్యుయల్ రోల్లో ప్రభాస్.. రాజాసాబ్ కోసం మారుతి క్రేజీ ప్లానింగ్
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్