Lucky Baskhar | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న అతికొద్ది మంది మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ క్రేజీ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
లక్కీ భాస్కర్లో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ మూవీని అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్ట మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ప్రమోషనల్ ఈవెంట్లో వెంకీ అట్లూరి చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈవెంట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతీ ఒక్క దుల్కర్ సల్మాన్ అభిమాని కాలర్ ఎగరేసేలా ఉండబోతుందని చెప్పాడు. సినిమాలో ప్రతీ డైలాగ్ హై పిచ్‌లో ఉంటుందని చెప్పాడు.
నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య.. అసలు కథ ఇప్పుడే మొదలైంది.. అంటూ దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
లక్కీ భాస్కర్ ట్రైలర్..
Raja Saab | డ్యుయల్ రోల్లో ప్రభాస్.. రాజాసాబ్ కోసం మారుతి క్రేజీ ప్లానింగ్
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్